కుంబీపాకం.. కోడి రక్తం.. 

Chinese Company Strangely Punished for Not Fulfilling the Target - Sakshi

ఆవిడెందుకు అలా మొహం పెట్టింది అని అడక్కండి.. ఎందుకంటే.. బతికున్న బురద చేపని తినమంటే.. మీరైనా అలాగే మొహం పెడతారు... అప్పుడే అయిపోలేదు.. వేడివేడి కోడి రక్తం ఇంకా వెయిటింగ్‌లో ఉంది.. చైనాలోని గ్వియ్‌జోలో ఉన్న ఓ సేల్స్‌ కంపెనీ టార్గెట్స్‌ పూర్తి చేయని ఉద్యోగులకు విధించిన శిక్ష ఇది.. ఇలా దాదాపు పాతిక మందికి ‘అపరిచితుడు’ సినిమాలోని కుంబీపాకం టైపు శిక్షలను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. అటు అధికారులూ ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.. ఇంతకీ దీనిపై వివరణ ఇచ్చిన కంపెనీ ప్రతినిధి ఏమంటాడో తెలుసా? వీళ్లంతా స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట.. అంతేనా.. భవిష్యత్తులో లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇది ప్రేరణగా ఉంటుందని సెలవిచ్చాడు..   ఇలాంటోడ్ని ఏం చేయాలంటారు??  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top