పాకిస్తాన్‌కు కూడా వెసులుబాటు ఇవ్వాలి | China opposition to the India | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు కూడా వెసులుబాటు ఇవ్వాలి

Jun 23 2016 2:44 AM | Updated on Jul 11 2019 8:48 PM

అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వ అంశంపై చైనా బుధవారం కూడా వ్యతిరే కత వ్యక్తం చేసింది.

భారత్‌కు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వంపై కొనసాగుతున్న చైనా వ్యతిరేకత
 
 బీజింగ్: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వ అంశంపై  చైనా బుధవారం కూడా  వ్యతిరే కత వ్యక్తం చేసింది. ఎన్‌ఎస్‌జీ సమావేశాల అజెండాలో భారత్, పాకిస్తాన్ సభ్యత్వ అంశం లేదని  చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్‌యింగ్ చెప్పాడు. ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం విషయంలో భారత్‌కు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తారో వాటిని పాకిస్తాన్‌కు కూడా కల్పించాలన్నారు. కాగా, ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కోసం లాబీయింగ్ చేయడానికి  భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ సియోల్ వెళ్లారు. విదేశాంగ శాఖ ఉన్నతాధికారి అమన్‌దీప్ సింగ్ గిల్ కూడా సియోల్ వెళ్లి.. భారత్ సభ్యత్వంపై అన్ని దేశాల్లో సానుకూల వైఖరి వచ్చేలా చేసేందుకు కృషి చేస్తున్నారు.  ఎన్‌ఎస్‌జీలో భారత్ చేరికకు తాము మద్దతిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది
 
 ఉ.కొరియాకు పాక్ అణు పదార్థాలు
 వాషింగ్టన్:  ఓవైపు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం కోసం ప్రపంచ దేశాల సహకారం కోరుతున్న పాకిస్తాన్ మరోవైపు  మోనెల్, ఇం కోనెల్ అనే అణు పదార్థాలను ఉత్తర కొరి యాకు అందిస్తోందని అమెరికా వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ విషయం చైనాకు తెలుసని పేర్కొన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement