ఐర్లాండ్‌ రచయిత్రికి మ్యాన్‌బుకర్‌

Anna Burns Wins Man Booker Prize - Sakshi

‘మిల్క్‌మ్యాన్‌’ నవలకు దక్కించుకున్న అన్నా బర్న్స్‌

లండన్‌: ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ను ఈ ఏడాదికి ఐర్లాండ్‌ రచయిత్రి అన్నా బర్న్స్‌(56) గెలుచుకున్నారు. ఆమె రచించిన ‘మిల్క్‌ మ్యాన్‌’ నవలకు ఈ అవార్డు దక్కింది. 20వ శతాబ్దం చివరినాళ్లలో ఉత్తర ఐర్లాండ్‌లో జాత్యంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరతకాలంలో ఓ యువతి, వివాహితుడితో సంబంధం ఏర్పర్చుకున్న ఇతివృత్తంతో ఈ నవల సాగుతుంది. ఆనాటి పరిస్థితులను మిల్క్‌మ్యాన్‌ ఎంతో సహజంగా కళ్లకు కట్టిందని ఎంపిక కమిటీ కొనియాడింది. మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ 49 ఏళ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్‌ మహిళగా అన్నా గుర్తింపు పొందారు. లండన్‌లో మంగళవారం  జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో అన్నా బర్న్స్‌కు ఈ అవార్డు కింద రూ. 50.85 లక్షల చెక్కు, ట్రోఫీ బహూకరించారు.

పేర్లు లేవు.. హోదాలే: ‘మిల్క్‌మ్యాన్‌’ నవల.. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కట్టుబాట్లను సవాలుచేసే సాధారణ యువతి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత్రదారులకు పేర్లు ఎలాంటి పేర్లు పెట్టకుండా  వారి హోదాలతోనే నవలను ముందుకు నడపడం విశేషం. ‘ఇంత వరకూ మనలో ఎవరూ ఇలాంటి నవలను చదవలేదు. పాఠకులను కట్టిపడేసే రచనాశైలితో అన్నా రూపొందించిన పాత్రధారులు సాధారణ ఆలోచనాధోరణులను సవాలుచేస్తాయి’ అని ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది.
అవార్డుతో అన్నా బర్న్స్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top