breaking news
Man Booker Prize Winner
-
ఐర్లాండ్ రచయిత్రికి మ్యాన్‌బుకర్
లండన్: ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాదికి ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్(56) గెలుచుకున్నారు. ఆమె రచించిన ‘మిల్క్ మ్యాన్’ నవలకు ఈ అవార్డు దక్కింది. 20వ శతాబ్దం చివరినాళ్లలో ఉత్తర ఐర్లాండ్‌లో జాత్యంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరతకాలంలో ఓ యువతి, వివాహితుడితో సంబంధం ఏర్పర్చుకున్న ఇతివృత్తంతో ఈ నవల సాగుతుంది. ఆనాటి పరిస్థితులను మిల్క్‌మ్యాన్ ఎంతో సహజంగా కళ్లకు కట్టిందని ఎంపిక కమిటీ కొనియాడింది. మ్యాన్‌బుకర్ ప్రైజ్ 49 ఏళ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా అన్నా గుర్తింపు పొందారు. లండన్‌లో మంగళవారం జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో అన్నా బర్న్స్‌కు ఈ అవార్డు కింద రూ. 50.85 లక్షల చెక్కు, ట్రోఫీ బహూకరించారు. పేర్లు లేవు.. హోదాలే: ‘మిల్క్‌మ్యాన్’ నవల.. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కట్టుబాట్లను సవాలుచేసే సాధారణ యువతి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత్రదారులకు పేర్లు ఎలాంటి పేర్లు పెట్టకుండా వారి హోదాలతోనే నవలను ముందుకు నడపడం విశేషం. ‘ఇంత వరకూ మనలో ఎవరూ ఇలాంటి నవలను చదవలేదు. పాఠకులను కట్టిపడేసే రచనాశైలితో అన్నా రూపొందించిన పాత్రధారులు సాధారణ ఆలోచనాధోరణులను సవాలుచేస్తాయి’ అని ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. అవార్డుతో అన్నా బర్న్స్ -
వీఎస్ నైపాల్ కన్నుమూత
లండన్: భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, ప్రఖ్యాత నోబెల్, మ్యాన్ బుకర్ బహుమతుల గ్రహీత విద్యాధర్ సూరజ్‌ప్రసాద్ (వీఎస్) నైపాల్ (85) అనారోగ్యంతో లండన్‌లో కన్నుమూశారు. శనివారం తమ ఇంట్లోనే వీఎస్ నైపాల్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఆదివారం తెలిపారు. ‘అద్భుత సృజనాత్మకతతో, నిరంతర కృషితో విజయవంతమైన జీవితాన్ని గడిపిన నైపాల్ తనకు ప్రీతిపాత్రమైన మనుషుల మధ్య తనువు చాలించారు’ అంటూ నైపాల్ భార్య నదీరా ఓ ప్రకటన విడుదల చేశారు. 1932 ఆగస్టు 17న ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ ఇంగ్లండ్‌లోనే ఆయన ఎక్కువ కాలం గడిపారు. ఇంగ్లిష్ భాషలో అత్యంత ప్రవీణుడిగా పేరు తెచ్చుకున్న నైపాల్ తన కెరీర్లో ముప్పైకి పైగా పుస్తకాలను రాశారు. మతాన్ని, రాజకీయ నాయకులను, వలసవాదాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన రచనలు అత్యంత ప్రజాదరణ పొందాయి. నైపాల్ తొలి పుస్తకం ‘ద మిస్టిక్ మాస్యూర్’ 1951లో ప్రచురితం కాగా, ఆయన రాసిన వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ విశ్వాస్’ 1961లో మార్కెట్లోకి వచ్చింది. తన తండ్రి శ్రీప్రసాద్ నైపాల్ జీవితం ఆధారంగా తీసుకుని ఈ పుస్తకాన్ని వీఎస్ నైపాల్ రాశారు. 2001లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని నైపాల్ అందుకున్నారు. 1971లోనే ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ పుస్తకానికి ఆయనకు మ్యాన్‌బుకర్ ప్రైజ్ లభించింది. సాహిత్య రంగానికి నైపాల్ చేసిన సేవలను గుర్తిస్తూ 1990లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ –2 ఆయనకు నైట్‌హుడ్‌ను ప్రదానం చేశారు. ఇస్లాం మతవాదంపై ఆయన రాసిన అమాంగ్ ద బిలీవర్స్, బియాండ్ బిలీఫ్ పుస్తకాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. గెరిల్లాస్, ఎ బెండ్ ఇన్ ద రివర్, ఎ వే ఇన్ ద వరల్డ్, ద మైమిక్ మెన్, ది ఎనిగ్మా ఆఫ్ అరైవల్, హాఫ్ ఎ లైఫ్ తదితర పుస్తకాలు నైపాల్‌కు రచయితగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అక్షర ప్రపంచానికి లోటు: కోవింద్ వీఎస్ నైపాల్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల సీఎంలు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కోవింద్ ఓ ట్వీట్ చేస్తూ ‘మానవ స్థితి గతులు, వలస వాదం, మత విశ్వాసాలపై అద్భుతమైన పుస్తకాలు రాసిన వీఎస్ నైపాల్ మృతి బాధాకరం. ఇండో–ఆంగ్లియన్ సాహిత్యానికేగాక, మొత్తం సాహిత్య ప్రపంచానికే ఆయన మరణం తీరని లోటు’ అని పేర్కొన్నారు. మోదీ ట్వీట్ చేస్తూ ‘చరిత్ర, సంస్కృతి, వలసవాదం, రాజకీయాలు, ఇంకా అనేక అంశాలపై అద్భుత రచనలు చేసిన వీఎస్ నైపాల్‌ను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన కుటుంబానికి నా సానుభూతి’ అని అన్నారు. నైపాల్ శిష్యుడు, అమెరికాకు చెందిన పర్యాటక పుస్తకాల రచయిత పాల్ థెరాక్స్, మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలిచిన భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ, మరో భారత సంతతి నవలా రచయిత హరి కుంజు తదితరులు కూడా నైపాల్ మృతికి సంతాపం తెలిపారు. పేదరికంలో పుట్టినా ఉన్నత శిఖరాలకు.. వీఎస్ నైపాల్ తండ్రి శ్రీప్రసాద్ ట్రినిడాడ్ గార్డియన్ పత్రికకు విలేకరిగా పనిచేసేవారు. చిన్నతనంలో పేదరికంలో బతికిన నైపాల్‌కు 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఉపకార వేతనం లభించింది. అప్పుడు ట్రినిడాడ్ నుంచి లండన్ వచ్చిన ఆయన.. ఇక తన మిగిలిన జీవితంలో ఎక్కువ కాలం అక్కడే గడిపారు. చదువుకునే రోజుల్లోనే ఓ నవల రాయగా అది ప్రచురితమవ్వక పోవడంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. 1955లో పాట్రీసియా ఆన్ హేల్‌ను పెళ్లాడిన ఆయన.. 1996లో ఆమె చనిపోవడంతో వయసులో తనకంటే ఎన్నో ఏళ్లు చిన్నదైన, అప్పటికే పెళ్లయ్యి విడాకులు తీసుకున్న పాకిస్తానీ జర్నలిస్ట్ నదీరాను రెండో పెళ్లి చేసుకున్నారు. -
మార్లోన్ జేమ్స్‌కు మ్యాన్ బుకర్ పురస్కారం
జాతీయం ఎన్‌జేఏసీపై సుప్రీంకోర్టు తీర్పు ఎన్‌జేఏసీ ఏర్పాటు, కొలీజియం వ్యవస్థను రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అక్టోబరు 16న తీర్పు వెలువరించింది. ఎన్‌జేఏసీ, 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే కొలీజియం వ్యవస్థలోనూ లోపాలున్నాయని తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థ పారదర్శకమేనని, దాన్ని ఇంకా సమర్థంగా అమలు చేసేందుకు సూచనలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. క్రీడలు కామన్వెల్త్లో భారత లిఫ్టర్ల పతకాల పంట కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 10 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకాలు భారత వెయిట్‌లిఫ్టర్లు సాధించారు. బంగారం: సతీశ్ కుమార్, లాలూ టకూ, నుంగ్ షిటాన్, కోజుమ్ తాబా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ లిఫ్టర్ రాగాల వెంకట్; జూనియర్, సీనియర్ మహిళల విభాగంలో పూనమ్ యాదవ్ రెండు స్వర్ణాలు; వికాస్ ఠాకూర్,స్వప్నప్రియ బారువా రజతం: జూనియర్ విభాగంలో అజయ్ సింగ్, సీనియర్ విభాగంలో రాగాల వెంకట్, యూత్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి.లలిత కాంస్యం: సీనియర్ మహిళల విభాగంలో మినాతి డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు చేరుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అక్టోబరు 18న జరిగిన ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్(చైనా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సింధూకు రూ.16 లక్షల ప్రైజ్‌మనీ, 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ ఖాన్ వీడ్కోలు 2011 వరల్డ్‌కప్‌లో 21 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు(311) తీసిన నాలుగో బౌలర్ జహీర్‌ఖాన్. కుంబ్లే(619), కపిల్‌దేవ్(434), హర్భజన్ సింగ్ (417) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. 37 ఏళ్ల జహీర్ టెస్ట్‌ల్లో 311 వికెట్లు, వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టాడు. బాడీ బిల్డర్ శ్వేత కొత్త చరిత్ర ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఆసియా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన శ్వేత రాథోడ్ రజత పతకాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో ఫిట్నెస్ ఫిజిక్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాడీబిల్డర్‌గా ఆమె ఘనత సాధించింది. దీంతో ఆమె నవంబరులో థాయిలాండ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత పొందింది. అవార్డులు నాలుగోసారి ‘గోల్డెన్ బూట్’ అందుకున్న రొనాల్డో ఐరోపాలో జరిగిన దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్‌లలో టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచినందుకు రియల్మ్యాడ్రిడ్ జట్టు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో నాలుగోసారి గోల్డెన్ బూట్ అవార్డు అందుకుని రికార్డు సృష్టించాడు. పోర్చుగల్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రొనాల్డో 2014-15 స్పానిష్ లీగ్‌లో 35 మ్యాచ్‌లు ఆడి 48 గోల్స్ చేశాడు. 2007-08 సీజన్లో మాంచెష్టర్ యునెటైడ్ తరఫున తొలిసారి ఈ అవార్డు అందుకున్న రొనాల్డో మిగిలిన మూడు సార్లు రియల్ మ్యాడ్రిడ్ తరఫున సాధించాడు. మార్లోన్ జేమ్స్‌కు మ్యాన్ బుకర్ పురస్కారం జమైకా రచయిత మార్లోన్ జేమ్స్‌కు ఈ ఏడాది మ్యాన్ బుకర్ పురస్కారం దక్కింది. జేమ్స్ రచించిన ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్’ నవలకు ఈ అవార్డు లభించింది. 1976లో జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లో ప్రఖ్యాత గాయకుడు బాబ్ మార్లేపై జరిగిన హత్యాయత్నాన్ని జేమ్స్ ఇందులో ప్రధానంగా చర్చించారు. చరిత్రలో దాగిన స్వరాలను అక్షరబద్ధం చేశారని బుకర్ ప్రైజ్ ఎంపిక కమిటీ ఆయన్ను ప్రశంసించింది. కైలాష్ సత్యార్థికి హార్వర్డ్ పురస్కారం నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థికి ఈ ఏడాది హార్వర్డ్ వర్సిటీ మానవతావాది (హ్యుమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్ 2015) పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం భారత్‌లో ఆయన చేస్తున్న సేవలకు గుర్తుగా ఈ అవార్డు ఇచ్చినట్లు హార్వర్డ్ ఫౌండేషన్ పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ గురుగ్రహంపై తగ్గుతున్న ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ గురుగ్రహం పైనున్న అతిపెద్ద ‘గ్రేట్ రెడ్‌స్పాట్’ క్రమక్రమంగా కుంచించుకుపోతోందని నాసా పేర్కొంది. రెడ్‌స్పాట్ క్రమంగా వృత్తాకారంగా మారుతోందని, గ్రహం కేంద్రం స్థానంలో అసాధారణమైన ఫిలమెంటరీ లక్షణం కనిపించిందని నాసా గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ శాస్త్రవేత్త ఆమీ సైమన్ తెలిపారు. వృక్ష, డైనోసార్ శిలాజాలు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అటవీప్రాంతంలో లక్షల ఏళ్లనాటి వృక్ష, డైనోసార్ శిలాజాలు లభించాయి. రెండు మీటర్ల పొడవైన వృక్ష శిలాజాలతోపాటు, అనేక ప్రాంతాల్లో డైనోసార్ ఎముకలు కనిపించాయని మూడేళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తున్న చరిత్ర అధ్యాపకుడు రెడ్డి రత్నాకరరెడ్డి వెల్లడించారు. ఓ సూక్ష్మరాతి పనిముట్టు, మూడు అంగుళాల జంతు శిలాజపు పనిముట్టు దొరికాయని తెలిపారు. కాకతీయుల నాటి గణేశ్వరాలయం కాకతీయ రాజు గణపతిదేవుడి కాలం నాటి గణేశ్వరాలయాన్ని వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులో బోగం మాటు వద్ద కనుగొన్నారు. ఆలయానికి సంబంధించిన మూల స్తంభాలు, పునాది, పైకప్పునకు ఉపయోగించిన బండరాళ్లు, శిలాశాసనాలపై చెక్కే సూర్య చంద్రుల గుర్తులు బయటపడ్డాయి. ఈ ఆలయం క్రీ.శ. 12, 13వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర పరిశోధకుడు కంచి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయం పేదరికంపై ఎఫ్ఏవో నివేదిక ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని పారదోలేందుకు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, వెనుకబడిన వర్గాలకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) తన నివేదికలో పేర్కొంది. ఐరాస నిర్ణయించిన జీవన ప్రమాణాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.97 ఖర్చు చేయలేని పరిస్థితిలో జీవిస్తున్నారు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పేదరికాన్ని రూపుమాపడానికి అమలు చేస్తున్న పలు పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆ నివేదికలో ఎఫ్ఏవో కితాబిచ్చింది. ఉద్యోగులు అమితంగా ఇష్టపడే ‘గూగుల్’ ఉద్యోగులు పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడే కంపెనీల జాబితాలో గూగుల్ ప్రథమస్థానంలో ఉందని ప్రముఖ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్’ పేర్కొంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ బెస్ట్ మల్టీనేషనల్ వర్క్ ప్లేసెస్’ పేరిట నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఎస్ఏఎస్ ఇన్స్టిట్యూట్, వీఎల్గోరే వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ: డబ్ల్యూహెచ్‌వో ప్రపంచవ్యాప్తంగా ఏటా పన్నెండు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అక్టోబర్ 19న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్ సేఫ్టీ-2015’ పేరుతో విడుదలచేసిన నివేదికలో పేద దేశాల్లోనే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ద్విచక్రవాహన ప్రమాదాల్లో పశ్చిమ పసిఫిక్, ఆగ్నేసియా దేశాల్లోనే మూడొంతుల మంది చనిపోతున్నారని, రోడ్డు భద్రత కార్యక్రమాలపై సమీక్ష జరిపి మరింత పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తామని డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ తెలిపారు. ఆసియా ఉత్తమ ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఆసియాలో ఉత్తమ ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఎంపికయ్యారు. ఈ మేరకు లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ మేగ జీన్ ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ జైట్లీని ‘ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్,ఆసియా’గా ఎంపిక చేశామని తెలిపింది. రాష్ట్రీయం తెలుగు రాష్ట్రాల్లో ‘స్యానీ’ పెట్టుబడులు చైనాకు చెందిన అగ్రశ్రేణి నిర్మాణరంగ సంస్థ స్యానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ రెండు పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అక్టోబరు 16న ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలో డ్రైపోర్టు ఏర్పాటుకు, ఫ్రీక్యాబ్ కాంక్రీట్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఈ ఒప్పందాలు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు స్యానీ గ్రూపు ముందుకొచ్చింది. ఈ మేరకు గ్రూపు చైర్మన్ లియాంగ్ వెంగెన్ తమ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పీఏసీ చైర్మన్‌గా రాంరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ శాసనసభ పీఏసీ చైర్మన్‌గా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డిని నియమిస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి రాజా సదరాం అక్టోబర్ 16న తెలిపారు. కాంగ్రెస్ సిఫార్సు మేరకు పీఏసీ సభ్యుడైన వెంకటరెడ్డిని ఈ పదవిలో స్పీకర్ మధుసూదనాచారి నియమించారు. హైదరాబాద్‌లోని ఆర్సీఐకి కలాం పేరు హైదరాబాద్‌లో రక్షణ రంగానికి చెందిన మిస్సైల్ కాంప్లెక్స్ ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ (ఆర్సీఐ) పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌గా మార్చారు. అక్టోబర్ 15న కలాం 84వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆర్సీఐని సందర్శించి అధికారికంగా ప్రకటించారు. సంక్షిప్తంగా టీఎస్పీఎస్సీ సభ్యులుగా టి.వివేక్, డి.కృష్ణారెడ్డి, కె.రామ్మోహన్ రెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ రావు అక్టోబరు 14న బాధ్యతలు స్వీకరించారు. మంగారి రాజేందర్, సీహెచ్ సాయిలు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అక్టోబరు 31న పీవీ రాజగోపాల్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారంతోపాటు రూ. 10 లక్షల నగదును కూడా అందజేస్తారు. పంది జన్యువులోని రిట్రోవైరస్‌లను క్రియారహితం చేయడం ద్వారా పంది అవయవాలు మనిషికి అమర్చవచ్చని హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఐరాస వాతావరణ మార్పుల అంతర్ ప్రభుత్వ ప్యానల్ చైర్మన్‌గా దక్షిణ కొరియాకు చెందిన హోసుంగ్లీ ఎన్నికయ్యారు. 2003 నుంచి భారత్‌లో కేసులు నమోదు కాని ‘యాస్’ చర్మవ్యాధిని కనిపించని వ్యాధుల జాబితాలో చేర్చారు. బీపీఎల్ గుర్తింపు ప్రమాణాన్ని ప్రపంచబ్యాంకు 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు పెంచింది. యమహా ఫాసినో మిస్ దివా-2015 కిరీటాన్ని మోడల్, నటి ఊర్వశి రౌతెలా సొంతం చేసుకుంది. 21 ఏళ్ల ఊర్వశి స్వస్థలం ఉత్తరాఖండ్. విశ్వసుందరి-2015 పోటీకి ఆమె భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లు, వెల్దుర్తి మండలాల్లో 2,721.98 ఎకరాలను డీఆర్డీఓకు కేటాయిస్తున్నట్లు రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మ అక్టోబరు 16న ఉత్తర్వులు జారీ చేశారు.