మయన్మార్‌ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి | 89 killed in Myanmar terrorist attack | Sakshi
Sakshi News home page

మయన్మార్‌ ఉగ్రదాడుల్లో 89 మంది మృతి

Aug 27 2017 3:01 AM | Updated on Sep 17 2017 5:59 PM

సైన్యం అధీనంలో రఖీనే రాష్ట్రం

సైన్యం అధీనంలో రఖీనే రాష్ట్రం

మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది.

మాంగ్డా: మయన్మార్‌లోని రఖీనే రాష్ట్రం ఉగ్రదాడులతో దద్దరిల్లుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశంలోని సరిహద్దు ప్రాంతాలపై తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల్లో 12 మంది భద్రతాదళ అధికారులు, 77 మంది మిలిటెంట్లు మరణించారు. అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రమంతటా ఎమర్జెన్సీని ప్రకటించింది. అరాకాన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ(ఎఆర్‌ఎస్‌ఏ) అనే ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రకటించింది.  

Advertisement
 
Advertisement
Advertisement