కాబూల్ పేలుళ్లలో 35మంది దుర్మరణం | 35 killed in Kabul explosions | Sakshi
Sakshi News home page

కాబూల్ పేలుళ్లలో 35మంది దుర్మరణం

Aug 8 2015 1:11 PM | Updated on Sep 3 2017 7:03 AM

ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో రాజధాని కాబూల్‌ దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్లలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో రాజధాని కాబూల్‌ దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్లలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. మొదటి పేలుడు సిటీ పోలీసు అకాడమీ సమీపంలో సంభవించగా రెండో పేలుడు ఎయిర్‌పోర్టుకు సమీపంలో సంభవించింది. షా షాహిద్ ఏరియాలో ఆత్మాహుతి దాడి జరిగింది.

పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును తీసుకొచ్చిన ఓ సూసైడ్ బాంబర్ శుక్రవారం సాయంత్రం తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 20 మందికి పైగా చనిపోయారు. పదులమంది గాయ పడ్డారు. ఆ తర్వాత కాసేపటికే ఎయిర్‌పోర్ట్ సమీపంలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా చనిపోగా పదుల మంది గాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement