దుర్గా ప్రసాదరాజుకు వైఎస్ జగన్ పరామర్శ | ys jagan mohan reddy console durga prasada raju | Sakshi
Sakshi News home page

దుర్గా ప్రసాదరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

May 12 2016 12:32 PM | Updated on Jul 25 2018 4:09 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్ఆర్ సీపీ నేత దుర్గా ప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్ఆర్ సీపీ నేత దుర్గా ప్రసాదరాజును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పరామర్శించారు. వైఎస్ జగన్ గురువారం హైదరాబాద్ లోని దుర్గాప్రసాదరాజు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి  అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఆది శేషగిరిరావు ఉన్నారు. కాగా మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్గా ప్రసాదరాజు గాయపడిన విషయం తెలిసిందే.



 

Advertisement
 
Advertisement
Advertisement