కారు ఆపి.. నిండా ముంచింది! | woman fled with One crore rupees value gold from a merchant | Sakshi
Sakshi News home page

కారు ఆపి.. నిండా ముంచింది!

Apr 17 2017 9:49 AM | Updated on Sep 5 2017 9:00 AM

కారు ఆపి.. నిండా ముంచింది!

కారు ఆపి.. నిండా ముంచింది!

ఓ వ్యాపారి దృష్టి మరల్చి కోటి రూపాయల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు.

కూకట్‌పల్లి: కూకట్‌పల్లి వివేకానందనగర్‌ ఎస్‌ మార్ట్ సమీపంలో ఓ వ్యాపారి దృష్టి మరల్చి కోటి రూపాయల విలువైన బంగారం ఎత్తుకెళ్లిందో మాయ ‘లేడి’.


వివరాలు.. అభిషేక్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి ఆదివారం రాత్రి చందానగర్ నుండి బషీరాబాగ్‌కు మూడున్నర కిలోల బంగారు నగలు తీసుకుని కారులో వెళ్తున్నాడు. మార్గం మధ్యలో కూకట్‌పల్లిలో మెయిన్‌ రోడ్డుపై ఏఎస్‌రాజు కాలనీ కమాన్‌ వద్ద ఓ మహిళ వచ్చి కారు పంక్చర్‌ అయిందని చెప్పింది. దీంతో వ‍్యాపారి కిందకు దిగగానే కారులో బంగారం ఉన్న బ్యాగ్‌ను తీసుకుని ఆమె ఉడాయించింది. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఘటన జరిగిన సమయంలో ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement