దేశవాలీ టోర్నీలో అభిషేక్ విధ్వంసం.. | Abhishek Agarwal 19 Balls-63 Runs-Vidarbha Premier League | Sakshi
Sakshi News home page

దేశవాలీ టోర్నీలో అభిషేక్ విధ్వంసం..

Jun 3 2026 5:15 PM | Updated on Jun 3 2026 6:04 PM

Abhishek Agarwal 19 Balls-63 Runs-Vidarbha Premier League

దేశవాలీ టోర్నీ విదర్భ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదయ్యింది. మంగళవారం ఇండియా వారియర్స్‌, నాగ్‌పూర్ హీరోస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇటీవలే ఐపీఎల్‌లో పెద్దగా మెరవని శుభమ్ దూబేతో పాటు అభిషేక్ అగర్వాల్ సంచలన ఇన్నింగ్స్‌లతో మెరిశారు. 

ముఖ్యంగా అభిషేక్ అగర్వాల్ కేవలం 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు శుభమ్ దూబే కూడా (33 బంతుల్లో 74 పరుగులు నాటౌట్‌, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తడాఖా చూపించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 107 పరుగులు జోడించడం దేశవాలీ క్రికెట్‌లో ఒక రికార్డుగా మిగిలిపోనుంది. 

ఇక ఇన్నిం‍గ్స్ చివరి ఓవర్‌లో అభిషేక్ అగర్వాల్ ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లు కొట్టి మొత్తంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ 16 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. మ్యాచ్ విష‌యానికొస్తే నాగ్‌పూర్ హీరోస్‌పై ఇండియ‌న్ వారియ‌ర్స్‌ 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 261 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శ‌ర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్‌), శుభ‌మ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్‌) మెరిశారు. అనంత‌రం నాగ్‌పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్‌వార్‌, గుర్దీప్‌సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఎఫెక్ట్‌.. బిగ్‌ న్యూస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement