సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రాంతంలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా ఆపరేషన్ నిర్వహించారు. సెక్యూరిటీని తప్పించుకుని పబ్‌లోకి ప్రవేశించి, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యక్షంగా గమనించారు.
డీసీపీ స్వయంగా పబ్ యాక్టివిటీని చిత్రీకరించి, వెంటనే లోకల్ పోలీసులను పిలిపించారు. అనంతరం సోదాలు నిర్వహించి, పబ్‌లో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో మొత్తం 9 నుంచి 10 మంది సిబ్బంది అరెస్టు అయ్యారు. యాజమాన్యం యువతుల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కూకట్‌పల్లి ప్రాంతంలో పబ్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


