రాజకీయ ఉనికి కోసమే ఉత్తమ్‌ యాత్రలు | Venugopala Chari fired on Uttamkumar Reddy | Sakshi
Sakshi News home page

రాజకీయ ఉనికి కోసమే ఉత్తమ్‌ యాత్రలు

Sep 17 2017 2:02 AM | Updated on Sep 19 2019 8:44 PM

రాజకీయ ఉనికి కోసమే ఉత్తమ్‌ యాత్రలు - Sakshi

రాజకీయ ఉనికి కోసమే ఉత్తమ్‌ యాత్రలు

తెలంగాణలో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

వేణుగోపాలాచారి ధ్వజం
సాక్షి,న్యూఢిల్లీ:
తెలంగాణలో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ రైతు బాట పేరిట యాత్రలు చేపడుతున్నా రని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి విమర్శిం చారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ.. రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే కాంగ్రెస్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కళ్లు ఉండికూడా అభివృద్ధిని చూడలేని గుడ్డివాళ్లు కాంగ్రెస్‌ నాయకులన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర కల్పించడానికి, క్షేత్ర స్థాయిలో రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే రైతు సమితులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement