వ్యాన్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి | two womans died in madhapur road accident | Sakshi
Sakshi News home page

వ్యాన్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి

Oct 17 2015 1:32 PM | Updated on Aug 30 2018 3:56 PM

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

హైదరాబాద్ :  మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న భాగ్యమ్మ(40), సరోజనమ్మ(55)ను వ్యాన్ ఢీకొంది. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. ఈ ఇద్దరు మహిళలు బోరబండలో నివాసం ఉంటూ ఇనార్బిట్ మాల్‌లోని ఓ  క్యాంటిన్‌లో పని చేస్తున్నారు.

 

మృతుల స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అని తెలిసింది. వారి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement