breaking news
two womans died
-
ఒకే చెట్టుకు ఇద్దరు యువతుల ఆత్మహత్య!
బెంగళూరు: ఉపాధి కోసం దేశం కాని దేశం వచ్చారు. కానీ ఏం సంకటం వచ్చిందో ఇద్దరు యువతులు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరులో యలహంక దగ్గర జక్కూరులో వెలుగు చూసింది. గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లినవారు చూసి కంగుతిన్నారు. జక్కూరులోని కృష్ణ రెస్టారెంట్ సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన వాకర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యలహంక పోలీసులు మృతులను నేపాల్‌కు చెందిన సిర్జనా (22), రితా (23)గా గుర్తించారు.దొరకని వివరాలువీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఏం పనిచేసేవారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.. అనే విషయాలు తెలియరాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. నిజంగా ఆత్మహత్య, లేక మరేదైనా జరిగిందా? అనే అనుమానాలున్నాయి, పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. -
వ్యాన్ ఢీకొని ఇద్దరు మహిళల మృతి
హైదరాబాద్ : మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న భాగ్యమ్మ(40), సరోజనమ్మ(55)ను వ్యాన్ ఢీకొంది. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. ఈ ఇద్దరు మహిళలు బోరబండలో నివాసం ఉంటూ ఇనార్బిట్ మాల్లోని ఓ క్యాంటిన్లో పని చేస్తున్నారు. మృతుల స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా అని తెలిసింది. వారి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కూలీలను బలిగొన్న మినీ లారీ
కొవ్వూరు రూరల్ :పొట్టకూటి కోసం కూలి పనులకు బయలుదేరిన ఇద్దరు మహిళా కూలీలను మినీ లారీ రూపంలో మృత్యు వు కబళించింది. కుటుంబం కోసం పొలాల్లో కాయకష్టం చేస్తున్న రేలంగి రత్నం(42), గేడేలి సుబ్బమ్మ(48) మరణంతో కొవ్వూరు మండలం వాడపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. వాడపల్లికి చెందిన రేలంగి రత్నం, గుడేలి సుబ్బమ్మ పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. నిత్యం ఇద్దరూ కలసి వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. శనివారం ఉదయం 7గంటల సమయంలో భోజనం క్యారేజీలను పట్టుకుని ఏటిగట్టుపై గల ఆర్ అండ్ బీ రోడ్డుపై వారిద్దరూ నడిచి వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మినీ లారీ వారి మీదుగా దూసుకు పోయింది. తీవ్రగాయాల పాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి చేతిలోని అన్నం క్యారేజీలు వ్యాన్ ముందుభాగంలో ఇరుక్కుపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆర్తనాదాలతో హోరెత్తిన ఘటనా ప్రాంతం మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఘటనా ప్రాంతం హోరెత్తింది. మృతురాలు రత్నంను తలచుకుని ఆమె భర్త వీర్రాజు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిం చింది. మృతురాలు రత్నంకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, అందరికీ వివాహాల య్యాయి. మరో మృతురాలు సుబ్బమ్మకు భర్త శ్రీరాములు, ఐదుగురు కుమార్తెలు ఉం డగా, ఇరువురు కుమార్తెలు మృతి చెందారు. గతంలో మృతి చెందిన రెండో కుమార్తె నాగలక్ష్మి పద్నాలుగేళ్ల కూతురు దుర్గను సుబ్బమ్మ పెంచుకుంటోంది. ఆమె మృతితో మనుమరాలు దుర్గ ఆనాథగా మారిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు, మాజీ సర్పంచ్ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు) చేరుకుని బాధిత కుటుంబాలకు సహకారం అందించారు.


