కరువు పేరుతో వేల కోట్ల కుంభకోణం | Thousands of crores scam in the name of drought | Sakshi
Sakshi News home page

కరువు పేరుతో వేల కోట్ల కుంభకోణం

Oct 18 2016 2:13 AM | Updated on Jul 28 2018 3:33 PM

కరువు పేరుతో వేల కోట్ల కుంభకోణం - Sakshi

కరువు పేరుతో వేల కోట్ల కుంభకోణం

రాయలసీమలో కరువు ఆసరాగా చేసుకొని వేల కోట్ల స్కాం చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు

వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: రాయలసీమలో కరువు ఆసరాగా చేసుకొని వేల కోట్ల స్కాం చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ నేతల ఆర్థిక ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ఆయన సోమవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పట్టిసీమ తరహాలో డబ్బులు పిండుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇవ్వలేని చంద్రబాబు ఆగస్టు 15న హంద్రీనీవా నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వడం కోసం రూ.450 కోట్లు, పేరూర్ డ్యాంకు రూ.50 కోట్లు ప్రకటించడాన్ని ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement