హుస్సేన్ సాగర్‌లో మృతదేహం | The body found in Hussain Sagar | Sakshi
Sakshi News home page

హుస్సేన్ సాగర్‌లో మృతదేహం

Oct 18 2015 8:45 PM | Updated on Sep 3 2017 11:10 AM

హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు వెలికితీశారు.

హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు వెలికితీశారు. ఎస్సై కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం ట్యాంక్‌బండ్‌పై గల కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం ఎదురుగా గల సాగర్ జలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు.

మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల వయసుంటుందని ఒంటిపై బ్రౌన్ కలర్ ఫ్యాంటు, తెలుపు బ్రౌన్ కలర్ చారల చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement