సంక్రాంతి పండుగ ముగించుకుని తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యే వారికోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: సంక్రాంతి పండుగ ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకునే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లతో పాటు రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, ఖమ్మం, వరంగల్ నుంచి నడిచే రెగ్యులర్ రైళ్లకు అదనంగా 35 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ నెల 20 వరకు రెగ్యులర్ రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కేంద్రాలను కూడా పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ వెల్లడించారు.