సికింద్రాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక రైలు | Special train between Secendrabad to patna | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ నుంచి పాట్నాకు ప్రత్యేక రైలు

Mar 9 2016 9:07 PM | Updated on Sep 3 2017 7:21 PM

హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్: హోలీ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-పాట్నా (02793/02794) ప్రత్యేక రైలు ఈ నెల 20వ తేదీ ఆదివారం రాత్రి 9.40 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 10 గంటలకు పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ శుక్రవారం ఉదయం 9.30కు పాట్నా నుంచి బయలుదేరి శనివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement