హోం శాఖకు రూ.3,739 కోట్లు | Rs .3,739 crore to the Home Ministry | Sakshi
Sakshi News home page

హోం శాఖకు రూ.3,739 కోట్లు

Aug 21 2014 1:51 AM | Updated on Sep 2 2017 12:10 PM

రాష్ట్ర హోం శాఖకు 2014-15 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,739 కోట్లు కేటాయించింది. ఇందులో కొత్త రాష్ట్రంలో పోలీసు శాఖ వాహనాలు ఖరీదు చేయడానికి రూ.100 కోట్లు ఇచ్చింది.

వాహనాల కొనుగోలుకు రూ. 100 కోట్లు
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హోం శాఖకు 2014-15 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,739 కోట్లు కేటాయించింది. ఇందులో కొత్త రాష్ట్రంలో పోలీసు శాఖ వాహనాలు ఖరీదు చేయడానికి రూ.100 కోట్లు ఇచ్చింది. కొత్తగా పోలీసు స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణము, ప్రస్తుతం ఉన్న వాటిని అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లు అవసరమని ప్రతిపాదించగా కేవలం రూ.12 కోట్లు కేటాయించింది. డీజీపీకి రూ.121.8 కోట్లు, జైళ్ల శాఖకు రూ.20 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.7.96 కోట్లు, సైనిక సంక్షేమ శాఖకు రూ.7.56 లక్షలు, ఏపీ పోలీసు అకాడెమీకి రూ.3.52 కోట్లు, గ్రేహౌండ్స్‌కు రూ.1.25 కోట్లు కేటాయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement