28న తిరుమలకు రానున్న రాష్ట్రపతి | president pranab mukherjee goes to tirumala on 28th december | Sakshi
Sakshi News home page

28న తిరుమలకు రానున్న రాష్ట్రపతి

Dec 24 2016 3:05 AM | Updated on Aug 8 2018 6:12 PM

28న తిరుమలకు రానున్న రాష్ట్రపతి - Sakshi

28న తిరుమలకు రానున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శ్రీవారి దర్శనానికి ఈనెల 28న తిరుమల రానున్నారు.

సాక్షి, తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శ్రీవారి దర్శనానికి ఈనెల 28న తిరుమల రానున్నారు. శీతాకాల విడిదికి రాష్ట్రపతి గురువారమే హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. విడిదికి వచ్చిన సందర్భంలో శ్రీవారిని దర్శించుకోవటం సంప్రదాయంగా ఉంది. 28న ప్రత్యేక విమానంలో ప్రణబ్‌ హైదరాబాద్‌ నుంచి ఉదయం 11 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి నేరుగా తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుని వరాహస్వామి వారిని, శ్రీవారిని దర్శించుకుంటారు. భోజనవిరామం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement