'6 నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించాం' | Power supply problem solved with in 6 months only, says KTR | Sakshi
Sakshi News home page

'6 నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించాం'

Jan 4 2016 7:25 PM | Updated on Sep 18 2018 8:38 PM

'6 నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించాం' - Sakshi

'6 నెలల్లోనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించాం'

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశంలో సోమవారం తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

హైదరాబాద్‌: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశంలో సోమవారం తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 నెలల్లోనే విద్యుత్‌ సరఫరా సమస్యను పరిష్కరించామని గుర్తుచేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని అన్నారు.

నీటి సరఫరా విషయంలో కూడా తాము ముందడుగు వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో రద్దీకి అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపడుతామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement