రాహుల్‌ మీద దాడిపై సీబీఐ విచారణ జరిపించాలి | Pongualeti Sudhakar Reddy about attack on Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌ మీద దాడిపై సీబీఐ విచారణ జరిపించాలి

Aug 6 2017 2:27 AM | Updated on Sep 17 2018 8:11 PM

రాహుల్‌ మీద దాడిపై సీబీఐ విచారణ జరిపించాలి - Sakshi

రాహుల్‌ మీద దాడిపై సీబీఐ విచారణ జరిపించాలి

గుజరాత్‌ పర్యటనలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ

కాంగ్రెస్‌ నేత పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌ పర్యటనలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంట్‌ సమావేశంలో ప్రధాని మోదీ ఈ ఘటనపై స్పందిస్తారనుకున్నామని, అయినా తప్పించుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement