జంటనగరాల్లో 15 ప్రమాదాలు, ఇద్దరి మృతి | new year celebrations, two killed in road accidents in twin cities | Sakshi
Sakshi News home page

జంటనగరాల్లో 15 ప్రమాదాలు, ఇద్దరి మృతి

Jan 1 2015 9:45 AM | Updated on Oct 17 2018 4:29 PM

హైదరాబాద్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా...ఎన్ని నిబంధనలు విధించినా న్యూ ఇయర్‌ వేడుకల్లో ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు.

హైదరాబాద్ : హైదరాబాద్‌ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా...ఎన్ని నిబంధనలు విధించినా న్యూ ఇయర్‌ వేడుకల్లో ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. ఈ సారి కూడా జంటనగరాల్లో మొత్తం 15  రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.  జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద చెట్టును బైక్‌ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు.

సికింద్రాబాద్‌లో డివైడర్‌ను బైక్‌ ఢీ కొట్టడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు.   పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించి మందుబాబుల జోరుకు మూకుతాడు వేశారు. 400 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 400 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement