'రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలదే బాధ్యత' | minister harishrao slams on Opposition parties over mallanna sagar project | Sakshi
Sakshi News home page

'రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలదే బాధ్యత'

Jun 26 2016 12:04 PM | Updated on Sep 4 2017 3:28 AM

'రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలదే బాధ్యత'

'రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలదే బాధ్యత'

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టులో రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలే బాధ్యత వహించాలని మంత్రి హరీష్రావు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టులో రైతులకు అన్యాయం జరిగితే విపక్షాలే బాధ్యత వహించాలని మంత్రి హరీష్రావు అన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ..విపక్షాలు 2013 యాక్ట్ అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు. దీని ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే రూ.లక్షా 80 వేలు, అదే జీవో 123 ప్రకారం అయితే రైతులకు రూ.4 లక్షల 80 వేలు అందుతుందన్నారు.

రాష్ట్రంలో విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్ వల్ల ఏడు గ్రామాలే ఇబ్బంది పడుతున్నాయని, కానీ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల 11 గ్రామాలు నష్టపోయాయని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని అందుకు గాను కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ముందుగా క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement