పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి | Man Missing, childrens approached by an auto driver | Sakshi
Sakshi News home page

పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి

Nov 12 2014 10:06 AM | Updated on Sep 2 2017 4:20 PM

పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి

పిల్లలను ఆటో ఎక్కించి మాయమైన తండ్రి

ముగ్గురు చిన్నారులను ఆటో ఎక్కించి, ఇప్పుడే వస్తానని చెప్పిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో చాలాసేపు ఎదురు చూసిన...

హైదరాబాద్ : ముగ్గురు చిన్నారులను ఆటో ఎక్కించి, ఇప్పుడే వస్తానని చెప్పిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో  చాలాసేపు ఎదురు చూసిన ఆటో డ్రైవర్ చేసేదిలేక హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆ చిన్నారులను అప్పగించాడు. మంగళవారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తి తన పిల్లలు భానుప్రసాద్‌, కవలలైన భాగ్యలక్ష్మి, భావనలను లక్డికపూల్‌ చౌరస్తా వద్ద ఆటో ఎక్కించి, ఉప్పరపల్లి చౌరస్తాలో దింపమని, తాను వెనకే బైక్‌పై వస్తానని ఆటోడ్రైవర్‌కు చెప్పాడు. అయితే ఉప్పరపల్లిలో ఎంతసేపు ఎదురుచూసినా .. వెంకటరమణ రాలేదు. పోలీసులు చిన్నారులను విచారించగా, తండ్రిపేరు తప్ప మరే వివరాలు చెప్పలేకపోతున్నారు. దాంతో పోలీసులు వీరి ఆచూకీ కనుక్కునే పనిలో ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement