సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man attempts suicide in telangana CM's camp office in begumpet | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Dec 27 2014 12:01 PM | Updated on Aug 21 2018 5:46 PM

తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కలకలం సృష్టించింది.

హైదరాబాద్ : తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు అనుమతి ఇవ్వటం లేదంటూ నాచారానికి చెందిన రాజు...ఈరోజు ఉదయం క్యాంప్ ఆఫీస్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు.

ఈ విషయాన్ని గమనించిన పోలీసులు అతడిని అడ్డుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనను ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించారని, సీఎంకు విన్నవించుకునేందుకు వస్తే అనుమతి ఇవ్వకపోవటంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు రాజు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement