బైక్ ఈఎంఐ కట్టలేక.. | man arrested in robbery case in hyderabad | Sakshi
Sakshi News home page

బైక్ ఈఎంఐ కట్టలేక..

Jun 18 2016 2:48 PM | Updated on Aug 30 2018 5:27 PM

తన బైక్ నెలవారీ వాయిదా కట్టేందుకు చేతిలో డబ్బులేక ఓ యువకుడు దోపిడీకి తెగబడ్డాడు.

హైదరాబాద్: తన బైక్ నెలవారీ వాయిదా కట్టేందుకు చేతిలో డబ్బులేక ఓ యువకుడు దోపిడీకి తెగబడ్డాడు. రెండు రోజుల క్రితం నాగోల్‌లో వృద్ధురాలని బెదిరించి దోపిడీ కి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేయగా ఈ విషయం వెల్లడయింది. వివరాలివీ.. ఎల్బీనగర్‌కు చెందిన శ్యామ్ అనే యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. సంపాదించినదంతా విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు.

అయితే, అతడు ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న బైక్‌కు నెలనెలా ఈఎంఐ కట్టాల్సి ఉండటంతో.. వేరే దారి లేక దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ మేరకు శ్యామ్ గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న సువర్ణ అనే వృద్ధురాలిని బెదిరించి నగలు దోచుకున్నాడు. ఆమె ప్రతిఘటించటంతో కత్తితో గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు శనివారం అతడిని పట్టుకుని, దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శ్యామ్ రిమాండ్‌కు తరలించనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement