దేవాశిష్‌ బోస్ అంత్యక్రియలు పూర్తి | Himachal Pradesh tragedy: Devashis Bose funeral funerals complete in amber pet | Sakshi
Sakshi News home page

దేవాశిష్‌ బోస్ అంత్యక్రియలు పూర్తి

Jun 11 2014 10:44 AM | Updated on Apr 6 2019 8:49 PM

దేవాశిష్‌ బోస్ అంత్యక్రియలు పూర్తి - Sakshi

దేవాశిష్‌ బోస్ అంత్యక్రియలు పూర్తి

హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి దేవాశిష్ బోస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి.

హైదరాబాద్ :  హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి దేవాశిష్ బోస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య  అంబర్ పేటలో అంత్యక్రియలు నిర్వహించారు.  ప్రమాదం జరిగిన పండో డ్యామ్ ఎగువ ప్రాంతంలో 100మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం  దేవాశిష్ బోస్ మృతదేహం లభ్యమైంది.

కాగా హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లిన విజ్ఞన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులలో 20 మంది బీయాన్ నదిలో కొట్టుకుని పోయిన విషయం తెలిసిందే.  బియాస్-నదిలో గల్లంతైన 24మంది విద్యార్ధుల్లో ఇప్పటి వరకు 6 మృతదేహాలను మాత్రమే రక్షణ సిబ్బంది వెలికి తీశారు. సోమవారం నలుగురు, మంగళవారం ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా.. ఇంకా 18మంది విద్యార్ధుల ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement