'త్వరలో డీఎస్సీ ప్రకటన' | dsc inform to soon in telangana says mlc yadav reddy | Sakshi
Sakshi News home page

'త్వరలో డీఎస్సీ ప్రకటన'

Sep 4 2015 4:48 PM | Updated on Sep 3 2017 8:44 AM

ప్రస్తుతం 8 వేల విద్యావాలీంటర్లను నియమించి తర్వాత డీఎస్సీ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు.

మోమిన్‌పేట (రంగారెడ్డి): ప్రస్తుతం 8 వేల విద్యావాలీంటర్లను నియమించి తర్వాత డీఎస్సీ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం జనరల్‌బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీలు ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణకు న్యాయం జరగలేదని వాపోయారు. త్వరలో అన్ని శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే భవిష్యత్ అంతా తెలంగాణదే అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement