విద్యుదా ఘాతంతో ఉద్యోగి మృతి | death of the employee with Electricity shock | Sakshi
Sakshi News home page

విద్యుదా ఘాతంతో ఉద్యోగి మృతి

Dec 17 2015 3:52 PM | Updated on Sep 5 2018 3:52 PM

ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండా ప్రమాద వశాత్తు ఒక విద్యుత్ ఉద్యోగి చనిపోయాడు.

ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు చేస్తుండా ప్రమాద వశాత్తు ఒక విద్యుత్ ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘనట హైదరాబాద్ నగరం కుత్బుల్లాపూర్ వాజ్ పేయి నగర్ లో గురువారం ఉదయం జరిగింది. స్థానికంగా కరెంటు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను నరికే కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో వాజ్ పేయి నగర్ లో ఒక విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి గోపాల్(30) అనే ఉద్యోగి రిపేర్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో బోల్టు ఒకటి చేతి నుంచి జారి పడింది. దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యుత్ ప్రసరిస్తున్న తీగలను తాకటంతో షాక్ కు గురై అక్కడి కక్కడే చనిపోయాడు. మృతుడిది మూసాపేట. కాగా.. అతడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement