'హోదా విషయంలో మొదటి ముద్దాయి బాబే' | congress leader C Ramachandraiah fires on AP CM over Special status | Sakshi
Sakshi News home page

'హోదా విషయంలో మొదటి ముద్దాయి బాబే'

May 2 2016 1:49 PM | Updated on Mar 23 2019 9:10 PM

'హోదా విషయంలో మొదటి ముద్దాయి బాబే' - Sakshi

'హోదా విషయంలో మొదటి ముద్దాయి బాబే'

ఓటుకు కోట్లు కేసు భయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నింటా రాజీపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు భయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నింటా రాజీపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. హైదరాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హొదా అవసరం లేదని కేంద్రప్రభుత్వం తేల్చడంలో మొదటి ముద్దాయి చంద్రబాబేనన్నారు.

పాలమూరు, డిండి ప్రాజెక్టులు పూర్తైతే ఏపీ ఎడారిగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే బాబు పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వానికి అప్పగించడం లేదని దుయ్యబెట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement