చంద్రబాబుపై ఫిర్యాదు | Chandrababu Naidu on the complaint | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఫిర్యాదు

Feb 5 2015 12:00 AM | Updated on Sep 2 2017 8:47 PM

చంద్రబాబుపై ఫిర్యాదు

చంద్రబాబుపై ఫిర్యాదు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను ...

ఖైరతాబాద్:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పాటు తెలంగాణను విదేశంతో పోల్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీడిమెట్లకు చెందిన న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి బుధవారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు.

ఇటీవల ఏపీఎన్జీఓలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు హైదరాబాద్ నగరంలో ఉండి ఆంధ్రాను పరిపాలించడం విదేశాల్లో ఉండి  పాలించినట్టుగా ఉందని చేసిన వాఖ్యలు పత్రికల్లో వచ్చాయని, తెలంగాణను అవమానించే రీతిలో విదేశంతో పోల్చడం రాజద్రోహం అవుతుందని రాజశేఖర్‌రెడ్డి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు వస్తాయని చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.  పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement