దళిత సీఎం అంటూ కేసీఆర్ మోసం: కె.లక్ష్మణ్ | BJP state president K.Laxman Comments on cm KCR | Sakshi
Sakshi News home page

దళిత సీఎం అంటూ కేసీఆర్ మోసం: కె.లక్ష్మణ్

Jul 2 2016 3:39 AM | Updated on Mar 29 2019 9:00 PM

దళిత సీఎం అంటూ కేసీఆర్ మోసం: కె.లక్ష్మణ్ - Sakshi

దళిత సీఎం అంటూ కేసీఆర్ మోసం: కె.లక్ష్మణ్

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని హామీనిచ్చి, తానే గద్దెనెక్కి కూర్చుని మోసం చేసిన...

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని హామీనిచ్చి, తానే గద్దెనెక్కి కూర్చుని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ దళిత మోర్చా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పిన సీఎం ఇప్పటిదాకా ఎన్ని కుటుంబాలకు భూమిని పంచారని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతమ్ మాట్లాడుతూ దళిత ఎంపీలు, ప్రజా ప్రతినిధులు బీజేపీలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.   కార్య క్రమానికి దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు అధ్యక్షత వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement