రేపు ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి | auto drivers planned to attack on assembly | Sakshi
Sakshi News home page

రేపు ఆటో డ్రైవర్ల అసెంబ్లీ ముట్టడి

Mar 9 2015 10:11 PM | Updated on Sep 2 2017 10:33 PM

ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు.

హైదరాబాద్: ఆటో డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. మహాత్మాగాంధీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు నుంచి ప్రారంభమౌతుందని యూనియన్ అధ్యక్షుడు మహ్మద్ ఇబ్రహీం అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోలకు ఈ- చలాన్ల నుంచి మినహాయింపు కల్పించాలని, లెసైన్సు లేని ఆటో డ్రైవర్ల కోసం మేళా, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆరోగ్య కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త ఆటోల కొనుగోలుకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని తమ డిమాండ్లుగా పేర్కొన్నారు.
(రాంగోపాల్‌పేట్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement