పెన్ను కావాలని వచ్చి .... | again chain snaching in city | Sakshi
Sakshi News home page

పెన్ను కావాలని వచ్చి ....

Jan 3 2016 2:02 AM | Updated on Aug 20 2018 7:27 PM

పెన్ను కావాలని వచ్చి .... - Sakshi

పెన్ను కావాలని వచ్చి ....

పెన్ను కొనే నెపంతో కిరాణా షాపునకు వచ్చిన ఇద్దరు దుండగులు షాపు నిర్వాహకురాలి పుస్తెలతాడును తెంచుకొని పారిపోయారు.

కాటేదాన్: పెన్ను కొనే నెపంతో కిరాణా షాపునకు వచ్చిన ఇద్దరు దుండగులు షాపు నిర్వాహకురాలి పుస్తెలతాడును తెంచుకొని పారిపోయారు. మైలార్‌దేవ్‌పల్లి క్రైం ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్ బస్తీలో గౌలికర్ ప్రమీలా, బన్సీలాల్ దంపతులు కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో వీరి షాపు వద్దకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్‌లేని పల్సర్ బైక్‌పై వచ్చారు. పెన్ను కావాలని వారు అడగడంతో షాపులో ఉన్న ప్రమీల వారికి పెన్ను అందించి వెనుకకు తిరిగేసరికి ఆమె మెడలోని 3.5 తులాల పుస్తెలతాడును తెంచుకొని బైక్‌పై పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement