పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి | ACB raids panchayat raj engineer's office, house in hyderabad | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి

Jul 22 2015 8:22 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ రాజేంద్రనాథ్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ రాజేంద్రనాథ్ నివాసంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావటంతో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. వారి తనిఖీల్లో రాజేంద్రనాథ్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన షాద్‌నగర్ నుంచి బదిలీపై వెళ్లారు. రవీంద్రనాధ్‌పై పలు అవినీతి ఆరోపణలు రావటంతో రాజేంద్రనగర్, గాంధీ నగర్‌లో ఉన్న ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.4 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. రెండు ఇళ్లు, రెండు ఫ్లాట్లు, కారు, 40 కిలోల బంగారం, కిలో వెండిని కూడా అధికారులు గుర్తించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement