24 గంటల్లోనే స్టేడియాలకు మంజూరు | 24 hours granted to stadiums | Sakshi
Sakshi News home page

24 గంటల్లోనే స్టేడియాలకు మంజూరు

Mar 20 2016 1:14 AM | Updated on Sep 3 2017 8:08 PM

24 గంటల్లోనే స్టేడియాలకు మంజూరు

24 గంటల్లోనే స్టేడియాలకు మంజూరు

తమ నియోజకవర్గాల పరిధిలో స్టేడియాల నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు సమర్పించిన 24 గంటల్లోనే

సాక్షి, హైదరాబాద్: తమ నియోజకవర్గాల పరిధిలో స్టేడియాల నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు సమర్పించిన 24 గంటల్లోనే మంజూరు చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి టి.పద్మారావు గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని 89 నియోజకవర్గాల్లో స్టేడియాలను ఇప్పటికే ప్రారంభించామని, మిగిలిన 30 నియోజకవర్గాల్లో కూడా దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే మంజూరుచేస్తామన్నారు.

శనివారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంఐఎం సభ్యుడు అల్తాఫ్ రిజ్వి మాట్లాడుతూ, ప్రస్తుతం క్రీడాస్థలాలు కరువవుతున్న నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడే మండలిలోకి వచ్చిన మంత్రి పద్మారావు వెంటనే స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు. తర్వాత అల్తాఫ్ రిజ్వి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Advertisement
 
Advertisement
Advertisement