అనంత ఆర్టీఓ లో అవినీతి బాగోతం | registration with Forged signatures in RTO office at anantapur district | Sakshi
Sakshi News home page

అనంత ఆర్టీఓ లో అవినీతి బాగోతం

Dec 15 2015 8:57 AM | Updated on Sep 22 2018 8:22 PM

అనంతపురం ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నట్టు మంగళవారం వెలుగులోకి వచ్చింది.

అనంతపురం: అనంతపురం ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి బాగోతం బయటపడింది. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నట్టు మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్ధానికంగా ఉండే ఆజాద్ అనే వ్యక్తి బైక్ ను అధికారులు సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన బైక్ ను ఆజాద్ కు తెలియకుండానే మరొకరికి విక్రయించారు.

అనంతరం అదే బైక్ ను రవాణా శాఖ అధికారులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న బాధితుడు అధికారులకు సంప్రదించగా వారు స్పందించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆజాద్ ఆరోపిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement