గ్లకోమాపై అవగాహన ర్యాలీ | Glaucoma awareness rally in Hyderabad | Sakshi
Sakshi News home page

గ్లకోమాపై అవగాహన ర్యాలీ

Mar 6 2016 5:50 PM | Updated on Sep 4 2018 5:07 PM

బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గ్లకోమా అవగాహన కోసం నడక కార్యక్రమం నిర్వహించారు.

బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గ్లకోమా అవగాహన కోసం నడక కార్యక్రమం నిర్వహించారు. ఈ వాక్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్ రాయల్స్ టీమ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. చంద్రశేఖర్, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి గ్లకోమా సెంటర్ హెడ్ డాక్టర్ శిరీష సెంథిల్, వైద్యులు, రోగులు, ప్రజలు ఈ వాక్‌లో పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు గ్లకోమా అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా ఈ వాక్ నిర్వహించడం జరిగిందని డాక్టర్ శిరీషా సెంథిల్ తెలిపారు. ఈవ్యాధిపై మరింత అవగాహన పెంచేందుకు ఈ నెల 12న గ్లకోమా ఎడ్యుకేషన్ ఫోరం నిర్వహిస్తున్నామన్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement