కెసిఆర్ మాట తప్పితే బుద్దిచెప్పే యత్నం!

కె.చంద్రశేఖర రావు - Sakshi


టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనంపై  దోబూచులాట ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పిన విషయం తెలిసిందే. విలీనానికి సంబంధించి కెసిఆర్ ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆ పార్టీకి చెందిన కెటిఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు తలా ఒక మాట మాట్లాడుతున్నారు.  విలీనం విషయంలో కెసిఆర్ మాటతప్పితే తగిన బుద్దిచెప్పేవిధంగా కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహం పన్నుతోంది. పలు ఆలోచనలు చేస్తోంది. 1. విలీనం కాకుంటే ఎన్నికలను ఆలస్యం చేయడం - 2. టిఆర్ఎస్ నుంచి వలసలు ప్రోత్సహించడం - 3.  రాష్ట్రపతి పాలన రద్దు చేసి తెలంగాణ వ్యక్తిని  ముఖ్యమంత్రిని చేయడం. 4. కెసిఆర్ను ఒంటరిని చేయడం.....ఈ విధంగా తెరవెనుక  పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మొదట దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ పలుమార్లు చెప్పారు. విలీనం అంశంతోపాటు ఇప్పుడు కెసిఆర్ ఆ మాట కూడా మాట్లాడటంలేదు. ఈ రెండు విషయాలలో  మాట తప్పితే కెసిఆర్ జనంలో పలచనైపోతారని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయ జెఏసితో  టిఆర్ఎస్కు విభేదాలు ఏర్పడాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా వలసలను ప్రోత్సహించడం మొదలు పెట్టింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి.అరవిందరెడ్డిని. ఆ పార్టీ బహిష్కృత ఎంపీ విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.  టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనంకాకుంటే ఆమ్‌ ఆద్మీ పార్టీగా మారుతుందని కేంద్ర మంత్రి జైరాం రమేష్ హెచ్చరించారు.ఇదిలా ఉంటే, ఈ నెల 3న టిఆర్ఎస్ కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం తరువాత విలీనం విషయమై కెసిఆర్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.  కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ను విలీనం చేసే విషయమై తానొక్కడే నిర్ణయం తీసుకోలేనని కెసిఆర్ చెప్పారు. ఆ పార్టీకి చెందిన ఎక్కువ మంది నేతలు, కార్యకర్తలు విలీనానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. అంతేకాకుండా ఆ పార్టీ నేతలు హరీష్ రావు వంటివారు కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడికి దిగుతున్నారు. వలసలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టారు.  ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని  కేసీఆర్ మండిపడ్డారు. ఆ విధంగా విలీనం కావలసిన రెండు పార్టీల మధ్య దూరం పెరిగిపోతోంది. పరిస్థితి ఎక్కడకు దారి తీస్తుందో 3వ తేదీ వరకు వేచిచూడాల్సిందే!

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top