జూలై 10 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 10, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై 10 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 9 2015 11:13 PM | Updated on Sep 3 2017 5:11 AM

జూలై  10 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై 10 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
కోట శ్రీనివాసరావు (నటుడు); సునీల్ గవాస్కర్ (క్రికెటర్)

 
 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై మొగ్గు చూపుతారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఆలయ సందర్శన కోరిక నెరవేరుతుంది.  మానసిక పరిపక్వత, ఆధ్యాత్మికత బాగా పెంపొందుతాయి. విదేశాలలో విద్య, ఉద్యోగావకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు పుట్టిన తేదీ 10. అంటే 1 (1+0=1) ఇది రవికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల స్వాభావికంగానే మీకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి.

దేవాలయాలను నిర్మించటం, ట్రస్ట్‌లను నిర్వహించడం, పదవులను చేపట్టడం వంటి వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులను చేపట్టకుండా పాతవాటినే కొనసాగించడం మంచిది. హాస్పిటల్, బ్యాంకింగ్, పెట్రోల్, ఎగుమతి- దిగుమతుల రంగాలలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల బాధ్యతలు తీరతాయి. మెడిటేషన్ చేయడం మంచిది.

లక్కీ నంబర్స్: 1, 2, 5, 6, 7; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గ్రే, గోల్డెన్; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్ర వారాలు. సూచనలు: అమ్మవారిని పూజించడం, సర్పదోష నివారణ పూజలు చేయించడం, వికలాంగులకు, అనాథలకు సహకరించడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది.
 - డా. ముహమ్మద్ దావూద్
 

Advertisement
 
Advertisement
Advertisement