ఎయిరోపోనిక్స్‌తో అధిక దిగుబడి

High yield with airoponics - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తున్న హైటెక్‌ సేద్య పద్ధతుల్లో ఎయిరోపోనిక్స్‌ ఒకటి. ఈ పద్ధతిలో ఫొటోలో చూపిన విధంగా పాలీహౌసుల్లో మొక్కల వేర్లు గాలిలోనే తేలియాడుతూ ఉంటాయి. ఈ వేర్లకు పోషక జలాన్ని మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా ఆటోమేటిక్‌ పద్ధతుల్లో నిర్ణీత సమయాల్లో తుంపరల రూపంలో పిచికారీ చేస్తుంటారు. త్రిస్సూర్‌లోని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్‌ సుశీల ఈ పద్ధతిపై శిక్షణ ఇస్తున్నారు.

కాలుష్య రహిత సాగు పద్ధతి. అధిక నాణ్యతతో కూడిన ఆకుకూరలను ఏడాది పొడవునా అందించే ఈ పద్ధతిలో ఆరుబయట పొలాల్లో కన్నా సగం కన్నా తక్కువ కాలంలోనే పంట చేతికొస్తుంది. 5–10 రెట్ల అధిక దిగుబడిని, అదే స్థాయిలో రాబడిని పొందవచ్చని, కూలీల అవసరం తక్కువేనని డా. సుశీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. వివరాలకు.. డా. సుశీల (త్రిస్సూర్, కేరళ) – 99615 33547

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top