విజయం మనదే: షర్మిల | YSR Congress Party will win in elections, says YS Sharmila | Sakshi
Sakshi News home page

విజయం మనదే: షర్మిల

Mar 24 2014 2:00 PM | Updated on Sep 2 2017 5:07 AM

విజయం మనదే: షర్మిల

విజయం మనదే: షర్మిల

పులిచింతల ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని వైఎస్ షర్మిల అన్నారు.

తెనాలి: పులిచింతల ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. ఇప్పుడు అధికారం కోసం ఎన్ని అబద్దాలు చేప్పేందుకైనా చంద్రబాబు వెనుకాడరని అన్నారు.

ఇచ్చిన మాటకోసం ఎంత దాకైనా వెళ్లగలిగింది వైఎస్ జగన్ ఒక్కరేనని షర్మిల చెప్పారు. చేయని నేరానికి జగనన్న 16 నెలలు జైలుశిక్ష అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలకు ధనబలం, కండబలం ఉండొచ్చు..  మనకు దేవుడి దయ ఉందని అన్నారు. ఎన్నికల్లో విజయం వైఎస్ఆర్ సీపీదే అన్నారు. జగనన్న నాయకత్వంలో నూతన అధ్యాయం ప్రారంభిద్దామని షర్మిల పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement