‘మోడీకి తగిన చోటు వారణాసి ప్రజలే చూపిస్తారు’ | Varanasi will show narendra Modi his real place, says Sharad Yadav | Sakshi
Sakshi News home page

‘మోడీకి తగిన చోటు వారణాసి ప్రజలే చూపిస్తారు’

Mar 22 2014 8:54 PM | Updated on Aug 29 2018 8:54 PM

‘మోడీకి తగిన చోటు వారణాసి ప్రజలే చూపిస్తారు’ - Sakshi

‘మోడీకి తగిన చోటు వారణాసి ప్రజలే చూపిస్తారు’

మోడీకి వారణాసి ప్రజలు తగిన స్థానం చూపిస్తారని జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ అన్నారు.

పాట్నా: మోడీకి వారణాసి ప్రజలు తగిన స్థానం చూపిస్తారని జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ అన్నారు. అద్వానీ పోటీ చేసే వారణాసి లోక్ సభ స్థానంపై వివాదం జరిగిన నేపథ్యంలో శరద్‌యాదవ్ శనివారం పాట్నాలో మాట్లాడారు. ‘‘బీజేపీ మోడీ జపం చేస్తోంది. వారణాసి మహాదేవుడిని పూజించే స్థలం. అక్కడి ప్రజలు మోడీకి తగిన చోటు చూపిస్తారు’’ అని ఎద్దేశా చేశారు. తమ పార్టీకి దేశవ్యాప్తంగా సానుకూలం వాతావరణం ఉందన్న  బీజేపీ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ... తదుపరి ప్రధాని మూడవ కూటమి నుంచి ఉంటారని శరద్‌యాదవ్ చెప్పారు.

 

ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలన్నారు. దేశంలోని పదకొండు పార్టీలు కాంగ్రెస్ కు, బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశానికి ప్రధాని పదవిని చేపట్టబోయేదెవరో కాలమే నిర్ణయిస్తుందన్నారు.శరద్‌యాదవ్ బీహార్ లోని మధేపుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement