బోగస్.. లైక్ బాబు! | TDP gets 3.65 lakhs of facebook fake likes through yellow media for three years | Sakshi
Sakshi News home page

బోగస్.. లైక్ బాబు!

Apr 11 2014 2:04 AM | Updated on Oct 22 2018 6:02 PM

బోగస్.. లైక్ బాబు! - Sakshi

బోగస్.. లైక్ బాబు!

మీడియా అయినా...సోషల్ మీడియా అయినా సరే...మేనేజ్ చేయడంలో బాబు ఘనుడే. తాజాగా ‘నెట్టింటి’లోనూ ఆయన ‘పచ్చ’ని చూపు పడింది...సోషల్ మీడియాను కాస్తా ‘ఎల్లో’ మీడియా

* ఎల్లో ఫేస్.. బుక్ అయింది
*  మూడేళ్లలో టీడీపీ పేజీకి 3.65 లక్షల లైక్‌లు
*  24 గంటల్లో ఏకంగా 75,000 పెంపు
*  టర్కీ నుంచి ఐదు వేలట
*  బాబు మరో హైటెక్ లీల
*  నివ్వెరపోతున్న నెటిజన్లు

 
 మీడియా అయినా...సోషల్ మీడియా అయినా సరే...మేనేజ్ చేయడంలో బాబు ఘనుడే. తాజాగా ‘నెట్టింటి’లోనూ ఆయన ‘పచ్చ’ని చూపు పడింది...సోషల్ మీడియాను కాస్తా ‘ఎల్లో’ మీడియాగా భావించి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడబోయి బొక్కబోర్లా పడ్డారు. ఆయన తాజా పాలి‘ట్రిక్స్’ కథాకమామీషు ఏంటంటే...

 
 తెలుగుదేశం పార్టీ అఫిషియల్ ఫేస్‌బుక్ పేజీకి మూడు సంవత్సరాల నేపథ్యం ఉంది. అలాంటి ఆ పేజ్‌కు మొన్నటి ఏప్రిల్ మూడో తేదీ నాటికి ఉన్న అభిమానుల సంఖ్య మూడు లక్షలా 65 వేల మంది. అయితే ఏప్రిల్ నాలుగో తేదీ నాటికి ఆ పేజ్‌కు ఉన్న అభిమానుల సంఖ్య నాలుగు లక్షలా 40 వేల మంది! రాత్రికి రాత్రి ఆ పేజ్‌కు 75 వేల మంది అభిమానులు పెరిగారు! ఉన్నపళంగా ఇన్ని ‘లైక్’లు ఏమిటి చెప్మా...! అని ఆశ్చర్యపోవడం నిపుణుల వంతైంది. ఈ హైటెక్ లీలను ఓ ఆంగ్ల పత్రిక వెలుగులోకి తేవడంతో నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి పేజ్‌కు హఠాత్తుగా ఇన్ని లైక్‌లు పెరగడం ‘ప్లాన్’ ప్రకారం జరిగిందే నని అంటున్నారు.
 
 ఈ పేజ్‌కు ఏ దేశాల నుంచి ఎక్కువమంది అభిమానులున్నారు, ఏ ప్రాంతం నుంచి ఎక్కువ లైకులు వచ్చాయి.. అనే విషయం గురించి పరిశీలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...తెలుగుదేశం పార్టీకి టర్కీ నుంచి దాదాపు ఐదువేల  లైకులున్నాయి. అయితే 2012 అధికారిక గణాంకాల ప్రకారం టర్కీలోని ప్రవాస భారతీయుల సంఖ్య కేవలం 500 మంది. అందులోనూ తెలుగువారి సంఖ్య ఇంకా తక్కువ. అలాంటి చోట అన్ని లైక్స్ ఉండటం నమ్మశక్యంగా లేదని విశ్లేషకులు అంటున్నారు.
 
  నకిలీ లైక్స్ గురించిన బండారం బైట పడటంతో టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో  వివరణ ఇస్తూ ఓ పోస్ట్‌ను పెట్టారు. టీడీపీ అధికారిక పేజీకి చంద్రబాబు అధికారిక పేజీలోని 1.4 లక్షల లైక్స్ ఒక్కసారిగా వచ్చి చేరాయని, అందువల్లే లైక్స్‌లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించిందని అందులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అసంబద్ధ వాదన. ఎందుకంటే టీడీపీ అధికారిక పేజీలో లైక్స్‌కు మరో పేజీలోని లైక్స్‌ను చేర్చాలంటే ఆ పేజీ పేరు కూడా టీడీపీ అనే ఉండాలి. మన అభ్యర్థన మేరకు ఒకే పేరుతో ఉన్న పేజీలనే ఫేస్‌బుక్ మెర్‌‌జ చేస్తుంది. చంద్రబాబు పేరుతో ఉన్న పేజీని టీడీపీ పేజీలో మెర్‌‌జ చేశారని వాదించడంలోనే వారి బండారం బైటపడుతోందని సోషల్ మీడియా అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
 
హైటెక్ లీలలు అన్నీ ఇన్నీ కావు...!
 కొన్ని టీవీ చానల్స్‌లో పెట్టే పోల్స్‌లో తెలుగుదేశం పార్టీకి అనుకూ లంగా ఫలితాలు వచ్చేందుకు నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఒక టీమ్ పనిచేస్తోందని తెలుగుదేశం నేతలే చెబుతారు. ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ వ్యవహారాన్ని చూస్తుంటే సోషల్ మీడియాను మ్యానేజ్ చేయడానికి కూడా ఇదే టీం పనిచేసి ఉంటుందని వారి వాదన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement