2వ విడత పోలింగ్ తేదీ మారే అవకాశం | Polling date will be change | Sakshi
Sakshi News home page

2వ విడత పోలింగ్ తేదీ మారే అవకాశం

Mar 26 2014 6:18 PM | Updated on Sep 17 2018 6:08 PM

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ తేదీని మార్చే అవకాశాలు ఉన్నాయి.

హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ తేదీని మార్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా పోలింగ్ తేదీని మార్పు చేసే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం  ఉంది.  రేపు సుప్రీంకు ఎన్నికల సంఘం  కొత్త తేదీని నివేదించనుంది.  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సుప్రీం కోర్టు రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా,  రాష్ట్ర వ్యాప్తంగా 1,096 జడ్పిటిసి  స్థానాలకు 5,034 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ చెప్పారు.  శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట  జడ్పిటిసి  స్థానం ఏకగ్రీవం అయినట్లు తెలిపారు.  


రాష్ట్రవ్యాప్తంగా 16, 589 ఎంపిటిసి స్థానాలకు 52,568 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. 331 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు.  వైఎస్‌ఆర్‌సీపీ -70, ఇండిపెండెంట్ 105, టీడీపీ-102, కాంగ్రెస్-31, టీఆర్‌ఎస్-15, సీపీఎం-4, సీపీఐ-2, బీఎస్పీ-1, బీజేపీ-1 స్థానాన్ని  ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నట్లు వివరించారు.

రంగారెడ్డి జిల్లాలోని 21 పంచాయతీలకు, విశాఖపట్నం జిల్లాలో 5 గ్రామ పంచాయతీలకు  ఏప్రిల్ 13న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు  నవీన్ మిట్టల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement