26న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం

నరేంద్ర మోడీ - Sakshi


న్యూఢిల్లీ: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న  నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన  సమావేశంలో మోడీ పేరును బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదించారు. బీజేపీ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ జోషి, ఎం.వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీలు ఆ  ప్రతిపాదనను సమర్థించారు.



 మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్టు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్లోని వడోదర లోక్సభ నియోజకవర్గం నుంచి దేశంలోనే అత్యధిక మోజార్టీ 5,70,128 ఓట్లతో గెలుపొందారు.  ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గాల నుంచి కూడా ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top