'ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు' | Kiran Kumar Reddy attack on Chiranjeevi | Sakshi
Sakshi News home page

'ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు'

Mar 20 2014 6:47 PM | Updated on Aug 14 2018 4:21 PM

'ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు' - Sakshi

'ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు'

ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పూర్తిగా అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. చిరంజీవి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లో డైలాగులు చెప్పడం సరికాదన్నారు.

విభజన సమయంలో కిరణ్కుమార్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని చిరంజీవి ఆరోపించిన సంగతి తెలిసిందే. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలతో కిరణ్ ఉద్యమం నడిపించారని అన్నారు. రాష్ట్ర విభజనను ఎవరూ వ్యతిరేకించలేదని చిరంజీవి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని దోషిగా చేయడం తగదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement