కేసీఆర్ టికెట్లు అమ్ముకోలేదా: పొన్నాల | kct sold his party tickets, alleges ponnala laxmaiah | Sakshi
Sakshi News home page

కేసీఆర్ టికెట్లు అమ్ముకోలేదా: పొన్నాల

Apr 15 2014 2:56 PM | Updated on Aug 15 2018 9:06 PM

కేసీఆర్ టికెట్లు అమ్ముకోలేదా: పొన్నాల - Sakshi

కేసీఆర్ టికెట్లు అమ్ముకోలేదా: పొన్నాల

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి మండిపడ్డారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి మండిపడ్డారు. టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకున్న విషయం వాస్తవం కాదా.. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి, మాట తప్పిన విషయం నిజం కాదా.. అవకాశవాదంతో కేంద్రంలో మంత్రి పదవిని తీసుకోలేదా అంటూ నిలదీశారు.

ఇంతకుముందు ఎన్నికలలో మహాకూటమి పేరుతో టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఇంకా ఫలితాలు రాకముందే బీజేపీ నాయకులతో మంతనాలు జరిపిన కేసీఆర్.. ఈసారి మైనారిటీ ఓట్ల కోసం థర్డ్ ఫ్రంట్తో కలుస్తానని చెప్పడం భావ్యమేనా అంటూ పొన్నాల నిలదీశారు. అయితే, ఎన్నికల తర్వాత మాత్రం ఒకవేళ యూపీఏలోకి టీఆర్ఎస్ వస్తామంటే అప్పుడు పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement