జన తెలంగాణ | jana telengana | Sakshi
Sakshi News home page

జన తెలంగాణ

Apr 20 2014 1:45 AM | Updated on Jun 4 2019 5:04 PM

వ్యవసాయం తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న రంగం చేనేత. ఆదరణ లేక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

నేతన్నలను ఆదుకోవాలి...

 వ్యవసాయం తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న రంగం చేనేత. ఆదరణ లేక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ హయాంలో తప్ప నేతన్నలను పట్టించుకున్నవారే కరువయ్యారు. కొత్త రాష్ట్రంలో చేనేత కార్మికులు సగర్వంగా బతకాలి.  50 ఏళ్లు నిండిన నేత కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలి. ఉచిత వైద్యం కల్పించాలి.
 -లింగబత్తులరమేష్ సోమారం,తొర్రూరు
 
 తొలి అడుగు..

 
సామాజిక తెలంగాణ సాధనలో దళితనేత సీఎం కావడం తొలి అడుగు మా త్రమే. దళిత సీఎం అని పదేపదే ప్రకటించిన  కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. ఉద్యమంలో దళితబహుజన శక్తుల పాత్రే అత్యంత కీలకం.  సామాజిక తెలంగాణ ద్వారానే దురన్యాయాలు అంతమవుతాయి.  సామాజిక న్యాయం కోసం తొలిమెట్టుగా తెలంగాణ తొలిసీఎం దళితుడే కావాలి.
 -కడియం సుదేశ్ కుమార్ ఎర్రబెల్లిగూడెం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement