ఫ్యాన్ హవా..! | general elections campaign | Sakshi
Sakshi News home page

ఫ్యాన్ హవా..!

Apr 17 2014 3:54 AM | Updated on Aug 14 2018 4:32 PM

ఫ్యాన్ హవా..! - Sakshi

ఫ్యాన్ హవా..!

జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగుతోంది.. ఫ్యాన్ గాలి ఉధృతంగా వీస్తోంది. ఓవైపు ప్రచారపర్వం.. మ

జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం
ఐదు నియోజకవర్గాల్లో విజయమ్మ పర్యటన పూర్తి

పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం
 
 జిల్లాలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం కొనసాగుతోంది.. ఫ్యాన్ గాలి ఉధృతంగా వీస్తోంది.  ఓవైపు ప్రచారపర్వం.. మరోవైపు అధినేతల పర్యటనలు.. ఇంకోవైపు నామినేషన్ల సందడితో పార్టీలో కోలాహలం నెలకొంది. నామినేషన్ల దాఖలుకు బుధవారం మంచిరోజు కావడంతో ఎక్కువమంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి జిల్లాలో ఎన్నికల వేడి మరింత పెంచారు.



 ప్రచారంలోనూ దూకుడే..
 జిల్లాలోని 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు వైఎస్సార్ సీపీ అందరికంటే ముందుగా అభ్యర్థులను ఖరారుచేసింది. టీడీపీ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థుల్ని ఖరారు చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళుతున్నారు. కాగా సోమవారం  జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోను, మంగళవారం గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో  పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె చేసిన పర్యటన విజయవంతం కావడంతో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఉన్నారు. దీనికితోడు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. అన్నదాతలు మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగుల వరకు అన్నివర్గాలవారికి మేలు చేసేలా ఆచరణాత్మకమైన హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. దీనిని పార్టీ అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement